ఏది సత్యం ఏది నిత్యం ??
చిన్నప్పటి నుంచీ పెంచిన అమ్మ నాన్నలు, కలిసి తిరిగిన స్నేహితులు, ప్రేమగా పలకరించే చుట్టాలు అంతా నిజమా? అని అడిగితే ఎవరైనా ఏమంటారు? హుహ్ మరి జగమే మాయ అంటే అర్ధం ఏమిటి?
భగవంతుని మార్గం లో పయనిస్తున్న మనుషులు రెండు విధాలు...ఒకటి భగవంతుని కోసం సర్వం త్యాగం చేయగల వాళ్ళు,
రెండు ..ఉన్నంతలో కుటుంబ జీవనం చేస్తూ వీలైనంత మానసిక వైరాగ్యం పాటించేవాళ్ళు!
మొదటి మార్గం లో గమ్యం పొందే అవకాశాలు మెండు! కానీ మనో నిబ్బరం, కఠిన పరిస్థితులు, మొదలైనవి తట్టుకోవాలి! రెండో మార్గం లో ఇంటి ఆహారం, కష్టాల్లో ఓదార్పు మొదలైనవి ఉన్నా భగవంతుని పై ధ్యానం చేయడానికి సమయం, ఉత్సాహం, అవకాశం తక్కువ!
రెండో మార్గం లో ఉండేవాళ్ళకి భగవంతుడు గీత లో చెప్పిన పద్ధతులు కొన్ని...
౧. ప్రగాఢ వైరాగ్యం (ఉన్నంతలో హాయ్ గా ఉంటూ కర్మ మార్గం లో పనులు చేస్తూ ఒక పనిమనిషి లాగ మనసుని దేవుని పై లగ్నం చేయడం)
౨. వివేకం (యోగః కర్మశు కౌశలం , సమత్వం యోగ ముచ్యతే ) అనగా సైకిల్ నడిపేవాడు ధ్యాస ని రోడ్ మీద, గమ్యం మీద పెడతాడు కానీ సైకిల్ హేండిల్, పెడల్స్ మొదలైన వాటి మీద పెట్టడు కదా...ఇదే విధం గా అన్ని పనులు దేవుని మీద ధ్యాస తో వైరాగ్యం తో చేయాలి, ఇంకా చేసిన పనులకి మన ప్రతిస్పందన సమత్వం తో ఉండాలి, అనగా మంచి ఫలితం వచ్చిన చెడు ఫలితం వచ్చినా ఎటువంటి మార్పు కోరుకోకుండా ఫలితాన్ని స్వీకరించడం !
పై రెండు పాటించాలి...అలాగే కామము, లోభము విడిచి పెట్టాలి...
ఈ విధం గా జీవనం సాగించ గలిగితే ఆత్మ సాక్షాత్కారం కలుగుతుందని నా నమ్మకం..అలా జీవించాలని నా ప్రయత్నం..
దేవుడి లాగ నటించే వ్యక్తులు, గురువుని అని చెప్పుకునే వాళ్ళు ఎందరు ఉన్నా భగవంతుడే వాళ్ళ ఆట కట్టిస్తాడు ...మనం నమ్మినా నమ్మకపోయినా !
సాటి జీవాల పై ప్రేమ, దయ తప్ప వేరే భావం కలిగితే అది మనకి మాత్రమె నష్టం ! ఇతరులకి కాదు!
అదండి ఇవాల్టి నా ఆలోచన !
శ్రీహరి పదకమలములు మన హృదయమున ఎల్లప్పుడు ఉండు గాక!